అంతా శివ మయం, శివుడు తలచనిదే చీమైనా కుట్టదు ఇలాంటివి వింటూ వుంటాము, అసలు దైవం అంటే ఏమిటి? నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఎలా కనిపిస్తాడు? ఇలా మనకి చాలా ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. మనలో ఉండే నాస్తికులు, ఆస్తికులకు అయితే దీని మీద యుద్దాలే జరుగుతాయి. ఇక్కడ దేవుడుని చూపించలేము కాని సహేతుకమైన వివరణకి ప్రయత్నిద్దాం. దేవుడు చేసినట్టు చెప్పబడే ఎన్నో గొప్ప కార్యాలకు నిలువెత్తు సాక్షాలు నిజ జీవితంలో దొరుకుతున్నాయి (సముద్రం క్రింద ఉన్న ద్వాపర మహా నగరం, రామసేతు తదితరములు) కావున దేవుడు ఉన్నాడు అన్నది సత్యం. అయన మహిమలు ఎన్నో నిజ జీవితంలో చూస్తున్నాం కనుక ఆయనే నిజం అంటారు మన ఆస్తికులు. మీరు ఏదైనా అద్బుతాన్ని చూపించండి దాని వెనుక దాగి ఉన్న సైన్సు మేము చెబుతాం అంతే కాని అది దేవుడు కాదు అంటారు మన నాస్తికులు. సరే నిజంగా ఇది మొత్తం సైన్సు అయ్యి ఉంటే ఇప్పటికీ మనం కనిపెట్టలేని ఎన్నో అద్బుతాలు ఉండిపోయాయి. అసలు ఎలా ఈ జీవరాసి ఉనికి మొదలు అయ్యింది. మొట్టమొదటి మానవుడు ఎలా పుట్టాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సైన్సు నందు ఉహజనిత సిద్దాంతాలు ఉన్నాయే కాని, ఇలాగే జరిగింది అన్న నిరూపణ లేదు, దాన్ని ఆస్తికులు...